![]() |
![]() |
సోషల్ మీడియాలో ఏ మూవీ ప్రమోషన్ అయినా ముందుగా టేస్టీ తేజతో మొదలుపెట్టడం మూవీ యూనిట్స్‌కి ఆనవాయితీగా మారింది. అలాంటి టేస్టీ తేజ తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. "నువ్వు జబర్దస్త్ చేసావ్, యూట్యూబ్ చేసావ్, ఇన్స్టాగ్రామ్ చేసావ్, బిగ్ బాస్ చేసావ్ ఇవన్నీ కాకుండా ఇంకేదో చేస్తున్నావ్ ఏంటది" అని హోస్ట్ అడిగింది. "బిగ్ బాస్ 7 తర్వాత నాకు చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి. అవి కమిట్ అయ్యి చేద్దాం అనుకునేలోపు బిగ్ బాస్ 8 వచ్చింది. దాని వలన నాకు 4 సినిమాలు పోయాయి.
ఇక ఇప్పుడు శర్వానంద్, శ్రీ విష్ణు, ఆనంద్ దేవరకొండ, అమరదీప్ వీళ్లందరితో కలిసి సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో అప్ కింగ్ మూవీ ఉంది. ఆల్రెడీ 4 మూవీస్ షూటింగ్ ఐపోయాయి. ఇంకో రెండు చేయాలి. శర్వానంద్ తో నటించిన నారీనారీ నడుమ మురారి మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. శ్రీవిష్ణుతో వీడియో చేయడం వలన అది చూసి ఈ మూవీలో ఆఫర్ వచ్చింది. శ్రీవిష్ణు అన్న మూవీలో నటిస్తున్నా. ఆయన ఇంకో రెండు మూవీస్ లో కూడా నన్ను రిఫర్ చేసాడు. అమరదీప్ తన కొత్త మూవీలో కొత్తగా కనిపించబోతున్నాడు. లుక్స్ మార్చాడు, డాన్స్ ఇరగదీసాడు. ఈ మూవీలో నాకు ఛాన్స్ రావడానికి అమరదీప్ కారణం.
నా చిన్నప్పుడు చూసిన సినిమా టికెట్ బాల్కనీ 20 ఇప్పుడు 200 లు. నాతో పాటు అవి కూడా పెరిగాయి. ఒక పెద్ద ఆపర్చ్యునిటీ వచ్చింది. అది ఐతే గనక టేస్టీ తేజ 2 . 0 అనుకున్నా. కానీ చిన్న మిస్ ఫైర్ అయ్యింది. మంచి ప్రాజెక్ట్, మంచి క్యారెక్టర్ అని తెలిసాక చాలా ఆశ పడ్డాను. కానీ పోయింది. పేరెంట్స్ సపోర్ట్ తర్వాత అదిరే అభి అన్న అవకాశం ఇవ్వడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను" అని ఎప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను అన్నాడు టేస్టీ తేజ.
![]() |
![]() |